HYDRA: వరద ముప్పు తప్పించిన హైడ్రాకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. అభినందనల ప్లకార్డులతో అమీర్‌పేట, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. మైత్రివనం వద్ద హైడ్రాకు మద్దతుగా మానవహారం కార్యక్రమం చేపట్టారు. 5 సెంటీమీటర్ల వర్షానికే మునిగిపోయే కాలనీలకు హైడ్రా ఉపశమనం కల్పించిందన్నారు.