తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు ప్రాంతాల్లో వర్షం తాకిడి అధికంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నవంబర్ 10 వరకు ఇలాగే వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఫ్లడ్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో సీఎం ఎంకే…