చాలా మంది బరువు తగ్గడానికి సులభమైన మార్గాల కోసం వెతుకుతారు. అందుకే.. వివిధ కంపెనీలు సప్లిమెంట్లు, కొవ్వు తగ్గించే మాత్రలు, పౌడర్లు, ఇంజెక్షన్లు వంటి ఉత్పత్తులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంటాయి. చాలా మంది ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు. అలాంటిదే మరో ఇంజెక్షన్ భారత్‌లో విడుదలైంది. జూన్ 24న, డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ బరువు తగ్గించే మందును విడుదల చేసింది. ఈ ఔషధం పేరు వెగోవీ (సెమాగ్లుటైడ్). ఇది ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది.