మత్స్యకారుల ఆందోళనపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు నా దృష్టిలో ఉన్నాయన్న ఆయన.. పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ వేస్తాం.. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యల్నీ గుర్తించాం.. ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ప్రభావం వల్ల తమ జీవనోపాధి మీద ఏర్పడుతున్న ప్రభావాలను గురించి ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు వ్యక్తపరచిన ఆందోళనలు, వారి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ…