భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎంఆర్ఎఫ్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఎంఆర్ఎఫ్ షేరు ధర లక్ష రూపాయలను ఈ రోజు తాకింది. బీఎస్ఈలో 1,00,300ను ఈ షేరు తాకింది.. ప్రస్తుతం రూ.99999 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ షేరు ఏడాది కనిష్ఠ ధర రూ.65,900గా నిలిచింది.