Business Today: తెలంగాణకు 3, ఏపీకి 2 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభించిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 యూనిట్లు వచ్చాయి. ఇందులో తెలంగాణకు 3, ఆంధ్రప్రదేశ్‌కు 2 లభించాయి. తెలంగాణలో జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖమ్మంలోని సిటీ యూనియన్ బ్యాంక్ దీనికి ఎంపికయ్యాయి.