నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. జనవరి 14న రాబోతున్న ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లోని ఎగ్జిబిటర్స్ అలకపూనినట్లు వినవస్తోంది. దీనికి కారణం ఇటీవల ప్రెస్ మీట్ లో థియేటర్లలో టికెట్ రేట్ల విషయంలో నాగార్జున స్పందన అని అంటున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీస్టూడియోస్ తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘బంగార్రాజు’ను సంక్రాంతికే విడుదల చేస్తున్నామని తెలియచేయటానికి ఇటీవల విలేకరుల సమావేశం…