కోహ్లి, రోహిత్, రాహుల్, బుమ్రా, షమి లాంటి సీనియర్ల గైర్హాజరీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత.. తిరిగి పుంజుకున్న టీమ్‌ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో ఐదో టీ20 ఆడేందుకు రెడీ అయింది. ఎక్కువగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టుతో బరిలోకి దిగి.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురు దెబ్బల తర్వాత గొప్పగా పుంజుకుని సిరీస్‌ను సమం చేసిన టీమ్‌ఇండియా.. అదే ఊపును కొనసాగిస్తూ దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు సమిష్టిగా సత్తాచాటి కప్పు కొట్టేయాలని…