ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారింది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన పూర్తయింది. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 17,500కు పైగా సూచనల పరిశీలన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిచేసింది. జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. కొన్ని జిల్లాల్లో…