Tollywood : సినీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోంది. అటు నిర్మాతలు మొన్న చెప్పిన వేతనాల పెంపు విధానానికి కార్మికులు అస్సలు ఒప్పుకోవట్లేదు. మొత్తం 13 సంఘాలకు వేతనాలు 30 శాతం పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో నేడు రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో నేడు నిర్మాతలు భేటీ అయ్యారు. ఇటు తెలంగాణ సినిమాశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పలువురు నిర్మాతలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇరు వర్గాలు పట్టువిడుపుతో ఉండాలని సూచించారు.…