బీహార్‌లోని పశువుల దాణా కుంభకోణం తరహాలోనే ఏపీ ప్రభుత్వం మూగజీవాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర వ్యాఖ్యనించారు. ఆర్బీకేల ద్వారా వల్లభ ఫీడుని అమ్ముడుతున్నారని, అది ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిది కాదా? అని ప్రశ్నించారు. ఫెర్టయిల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్‌ను మెట్రిక్ టన్ను రూ. 16 వేలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ.. ఆ కంపెనీ సరఫరా…