Sonam Wangchuk: రాష్ట్ర హోదా కోరుతూ, లడఖ్ వ్యాప్తంగా హింసాత్మక అల్లర్లు జరిగాయి. భద్రతా బలగాలు, బీజేపీని టార్గెట్ చేస్తు ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు మరణించారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు.ఈ అల్లర్లు ఉద్దేశపూర్వకంగా చేయబడ్డాయని లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆరోపిస్తూ, లేహ్ వ్యాప్తంగా ఖర్ఫ్యూ విధించారు. అల్లర్ల వెనక ఉన్న ప్రతీ వ్యక్తిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
లడఖ్ అల్లర్ల నేపథ్యంలో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చిక్కుల్లో పడ్డారు. గత కొద్ది రోజులుగా లడఖ్‌కురాష్ట్ర హోదా కల్పించాలని నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో లడఖ్‌లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది.