‘కింగ్ కోబ్రా’.. ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము. శాస్త్రీయంగా దీనిని ఓఫియోఫాగస్ హన్నా అని పిలుస్తారు. కింగ్ కోబ్రా సాధారణంగా 13 అడుగుల పొడవు ఉంటుంది. కొన్ని 18 అడుగుల వరకు కూడా పెరుగుతాయి. ఈ పాము పడగ విప్పితే భయంకరంగా కనిపిస్తుంది. మాములుగా ఇవి మనుషులను ఏమీ అనవు కానీ.. దానిని గెలికితే మాత్రం ఊరుకోవు. కింగ్ కోబ్రా ఎక్కువగా ఇండోనేషియా, భారతదేశంలో ఉంటాయి. అడవుల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. కింగ్ కోబ్రా విషపూరితమైనది మాత్రమే…