అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. 4 ఫోర్లు, 5 సిక్సులతో హార్దిక్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.…