తెలంగాణలో వరి వేయవద్దని ప్రత్నామ్నాయ పంటలు వేయాలని స్వయంగా కేసీఆర్, మంత్రులు పదే పదే చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతూనే వున్నారు. అయితే రైతులు మాత్రం చాలా చోట్ల వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వరిపంట వేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసింది తప్ప ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహనా కల్పించడం లేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.…