Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే, ఇద్దరు హిందువుల్ని అత్యంత దారుణంగా హత్యలు చేశారు. బంగ్లాదేశ్ కళాకారులు, సాంస్కృతిక చిహ్నాలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, ఢాకాకు 120 కి.మీ దూరంలో ఉన్న ఫరీద్‌పూర్‌లో బంగ్లా ఫేమస్ సింగర్ జేమ్స్ కచేరీపై దాడికి పాల్పడ్డారు.