మరికాసేపట్లో పెళ్లి. ఇళ్లంతా సందడి వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు సంగీత్ లో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఇక్కడే విది వింతనాటకం ఆడింది. పెళ్లికూతురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలోని బర్గాడి గ్రామంలో జరిగిన విషాద సంఘటన మొత్తం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. వధువు పూజ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. Also…
మధ్య పంజాబ్ లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇక్కడ రెండు సీట్ల పోకడలు అందరినీ అబ్బుర పరుస్తున్నాయి. ఖలిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తున్న అభ్యర్థులు.. ఫరీద్‌కోట్, ఖాదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.