తమిళనాడు కృష్ణగిరిలోని ఓ పాఠశాలలో నకిలీ ఎన్‌సీసీ క్యాంపులో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ప్రధాన నిందితుడు శివరామన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్‌కు ముందు విషం తాగినట్లు చెప్పారు.
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా తమిళనాడులో మరో అత్యంత ఘోరమైన కీచకపర్వం వెలుగులోకి వచ్చింది.