Duplicate MRO: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్‌చల్ కలకలం రేపుతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు నకిలీ ఉద్యోగిగా సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో నకిలీ తహసీల్దార్‌ను సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కోమ్పల్లి ప్రాంతానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి తాను తహసీల్దార్‌గా పని చేస్తున్నట్లు పేర్కొంటూ నకిలీ ఐడీతో సచివాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్ స్టిక్కర్‌తో వాహనంలో వచ్చిన అతడిపై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆపై సైఫాబాద్…
నటి మీరా చోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో మహారాష్ట్ర బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది ఫేక్ ఐడీ అని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు థానే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ…