Rukmini Vasanth: క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎక్స్ (ట్వీట్టర్) లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడిపై చర్యలు తీసుకుంటానంటూ పెట్టిన పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎంతోమంది ఇతరుల పేర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున రుక్మిణి పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారని తెలియడంతో.. ఈ విషయంలో తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది.