ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఒకే మంత్రి పేషీలో నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు సోషల్ మీడియా అసిస్టెంట్లను నియమించినట్టు సమాచారం. సోషల్ మీడియా అసిస్టెంట్ నియామక ప్రక్రియ బాధ్యత ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఫేక్ అపోయింట్‌మెంట్ ఆర్డర్ బయటకు వచ్చింది.