CM Jagan Review Meeting: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈఏపీ (ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూడెవలప్‌మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనుల్లో…