Export Duty on Onion: దేశం నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీని కింద ఉల్లి ఎగుమతులపై 40 శాతం భారీ సుంకం విధించారు. ఇది ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుంది.