ముస్లింలకు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం అయింది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముస్లింలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసం నేపథ్యంలో ఇప్పటికే మసీదులను అందంగా ముస్తాబు చేశారు. నెలవంక దర్శనమిచ్చిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి నమాజులు చేపట్టనున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. రంజాన్ నేపథ్యంలో, ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు,…