ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం ఏపీ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మే 13 నుంచి 19 వరకు ఈఏపీసెట్, మే 8న ఈసెట్, 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఎడ్‌సెట్, జూన్ 9న లాసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. సీబీఎస్‌ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. అటు తెలంగాణలోనూ ఏప్రిల్ 3 నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. Read Also: Rishab Pant…
APPSC Exams: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021లో విడుదల చేసిన పలు నోటిఫికేషన్‌లకు సంబంధించిన పరీక్షా తేదీలను అధికారులు విడుదల చేశారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, సబ్జెక్ట్ పేపర్ పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. గెజిటెడ్ విభాగంలో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు అక్టోబర్ 21న జరుగుతాయి. సబ్జెక్ట్ పేపర్ పరీక్షల్లో పేపర్-2 19వ తేదీ…
సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు 10, 12 తరగతులకు సంబంధించి బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం అవుతాయని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అలాగే మే 24న ఈ పరీక్షలు ముగుస్తాయని షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. 12వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 26న ప్రారంభం అవుతాయని.. ఈ పరీక్షలు జూన్ 15న పూర్తవుతాయని తెలిపింది. ఈ…
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 21న జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు మార్చాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అటు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు..…
తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించగా.. త్వరలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా వెల్లడించే అవకాశముంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక.. పదో తరగతి పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11, 12 తేదీల్లో ప్రారంభం అవుతాయని సమాచారం. వాస్తవానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్‌లోనే…