మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ పోలీసులు. కొండాపూర్‌లో నారాయణను అదుపులోకి తీసుకున్నారు ఏపీ సీఐడీ అధికారులు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధముందన్న ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు ఏపీలో సంచలనం కలిగించాయి. ఇటీవల సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ పలు అంశాలపై ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉందని…