TG CPGET-2025 PG Entrance Exams: వచ్చే నెల(ఆగస్టు) 4వ తేదీ నుంచి తెలంగాణలో పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో TG CPGET-2025 పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ PG కోర్సులు, డిప్లొమాలు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు పెట్టనున్నారు.