పోలీసుల అండతో రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్ ఘటనపై చినరాజప్ప స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎంత భయపెట్టినా రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆగదని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతులు ఉన్నా ఖాకీలు ఆంక్షలెందుకు పెట్టారు..?…