జాతీయ స్థాయిలో చక్రం తిప్పిందేకు టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చేశారు.. పొరుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఏపీలో ముఖ్య నేతలపై బీఆర్ఎస్ కన్నేసిందా..? అలాంటి వారిని గుర్తించి బీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందా..? అంటే విశాఖలో జరిగిన ఓ పరిణామం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణతో సమావేశం అవ్వడానికి తెలంగాణ…