భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. దీనిని ప్రతి ఏడాది పదుల సంఖ్యలో పర్వతారోహకులు అధిరోహిస్తుంటారు. చాలా మంది ఈ మంచుపర్వతం సానువులను సందర్శిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఈ మంచుశిఖరంపై శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2వేల సంవత్సరాలలో ఏర్పడిన మంచు కేవలం 25 ఏళ్లలో కరిగిపోయింది. మంచు ఏర్పడటానికి పట్టిన సమయం కన్నా 80 రెట్లు వేగంగా మంచు కరిగిపోతున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబందించిన విషయాలను నేచర్ క్లైమేట్ జర్నల్ లో పేర్కొన్నారు.…