భారతీయ మార్కెట్లో కొత్త కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వాహనాలకు సరసమైన ధరలు, అధిక సామర్థ్యం, పర్యావరణానికి అనుకూలత వంటి విశేషాలతో అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగం పెరుగుతున్న డిమాండ్‌తో వాటి తయారీ సంస్థలు ప్రతి రోజు కొత్త ఆవిష్కరణలను ప్రజలకు అందిస్తున్నాయి. ఈ క్రమంలో సింపుల్ ఎనర్జీ అనే భారతీయ స్టార్టప్ ఫిబ్రవరి 11న 1.5 జనరేషన్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.