ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యూరోపియన్ యూనియన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. మంగళవారం జరిగిన ఈయూ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొరతని అధిగమించేందుకు.. వీలైనంత త్వరగా ఇతర సరఫరా మార్గాల్ని వెదుక్కోవాలని, సంప్రదాయేతర ఇంధన…