Pakistan: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేది బయటకు మాత్రమే కనిపిస్తుంటుంది. మొత్తం పాకిస్తాన్ వ్యవస్థల్ని శాసించేది అక్కడి సైన్యమే. ఈ విషయం ప్రపంచానికి కూడా తెలుసు, కానీ తెలిసీతెలియనట్లు వ్యవహరిస్తుంటుంది. సైన్యం కోరుకున్న వారే అక్కడ ప్రధాని అవుతారు. ఇందు కోసం ఎన్నికల్ని రిగ్గింగ్ కూడా చేస్తారు.