పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత చేరువ చేసేందుకు ఈపీఎఫ్ఓ నిబంధనలను సరళీకరిస్తూ.. కొత్త రూల్స్ ను ప్రవేశ పెడుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బును ఉపసంహరించుకునే నియమాలలో పెద్ద మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ సభ్యులు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి ఖాతాలోని మొత్తాన్ని లేదా దానిలో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని పదవీ విరమణ నిధి సంస్థ ఒక ప్రతిపాదనను సమర్పించిందని ఒక…