Forest Fire : కాళేశ్వరం ప్రాంతంలో కార్చిచ్చు మంటలు అదుపుతప్పి అడవిని కబళిస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న నీలగిరి చెట్ల ప్లాంటేషన్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో వేలాది మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. దహనంల వ్యాప్తి కారణంగా దట్టమైన పొగ ప్రాంతమంతా కమ్మేసింది. మంటలు వ్యాపించడంతో స్థానిక గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పలువురు స్థానికులు బకెట్లతో నీళ్లు…
Harish Rao : కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ మాజీ మంత్రి టీ. హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న విధానంపై ప్రశ్నలెత్తుతూ, కేంద్ర కమిటీకి అవసరమైన డాక్యుమెంట్లు అందించామని తెలిపారు. “ఎవరైనా చెట్టు నరకాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. వాల్టా చట్టం ప్రకారం కూడా చెట్లు రక్షించాల్సిందే,” అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్వయంగా చెట్లు నరికిందని ఆరోపించారు. ఈ విషయంలో TGIIC స్వయంగా పోలీసులను సంప్రదించి రక్షణ…
Mulugu Forest : తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యం ప్రస్తుతం అగ్నికి ఆహుతి అవుతోంది. అడవుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నా, అడవుల నరికివేత, చెట్ల కాల్చివేత మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే అడవుల్లో అగ్నిప్రమాదాలు రోజూ ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పసర, కన్నాయిగూడెం వంటి అటవీ ప్రాంతాల్లో ప్రతీ రోజు మంటలు వ్యాపిస్తూ వన్యప్రాణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడవుల…