గాజాలో మానవతాసాయం అందించేందుకు 44 దేశాల పౌరులను తీసుకెళ్తున్న గ్రెటా థన్‌బర్గ్ నౌక్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యునీషియా దగ్గర ఈ దాడి జరిగింది. పోర్చుగీస్ జెండా కలిగిన గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నౌక అనుమానిత దాడిలో దెబ్బతిన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
గాజాలో మానవతా సాయం చేసేందుకు వెళ్తున్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ బృందాన్ని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఫ్రీడమ్ ఫ్లొటిల్లా కూటమి అనే సంస్థ ఆధ్వర్యంలో గాజాకు వస్తున్న ఈ నౌకలో థన్‌బర్గ్, 12 మంది ఆందోళనకారులు ఉన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పర్యావరణ పరిరక్షణ కార్యకర్తను ఆక్వా రైతులు స్తంభానికి కట్టి చితకొట్టారు. తీవ్ర గాయాలైన సదరు కార్యకర్త అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఉప్పలగుప్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. గ్రామంలో…