Today (30-01-23) Business Headlines: ఏపీలో ఒబెరాయ్ హోటల్స్: ఆంధ్రప్రదేశ్‘లోని వివిధ జిల్లాల్లో ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ నిర్మాణం జరగనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDCతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా మొదట తిరుపతిలోని అలిపిరిలో 100 కోట్ల రూపాయల ఖర్చుతో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టనుంది. దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని లీజ్ కమ్ రెంట్ ప్రాతిపదికన కేటాయించింది.