ఎప్పుడో అప్పుడు కోపం రావటం సహజమే. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు సజావుగా లేకపోయినా.. మనస్పర్ధలు తలెత్తినా ఆగ్రహావేశాలకు లోనుకావటం, తిరిగి మామూలుగా అవటం పెద్ద విషయమేమీ కాదు. కానీ తరచూ ఆగ్రహానికి గురవుతున్నా, ఇది రోజువారీ వ్యవహారాలను దెబ్బతీస్తున్నా జాగ్రత్త పడాల్సిందే. ఇందుకు కొన్ని జబ్బులు కూడా కారణం కావొచ్చు. వీటి గురించి తెలుసుకొని ఉంటే ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవటానికి వీలుంటుంది. కోపం చాలా ప్రమాదకరం. కోపం వల్ల అనేక రకాల…