ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురిలో ఉన్న ఓ అనాధ మృత దేహాన్ని ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి సమయంలో మాయం చేసేందుకు మార్చురీ అసిస్టెంట్ ప్రయత్నించాడు. ఆ విషయాన్ని గమనించిన మహిళా ఉద్యోగి.. అతన్ని అడ్డుకోవడంతో మృతదేహం తరలింపు నిలిచిపోయింది. అనాధ మృతదేహాన్ని మెడికల్ కాలేజీలకు అమ్మడానికి తీసుకువెళుతున్నారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో విషయాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది గోప్యంగా ఉంచారు.