జనాల్లో ఎలక్ట్రిక్ బైకుల మోజు విపరీతంగా పెరిగింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకేముందు.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి డీలర్‌షిప్ కోసం కొందరు ముందుకొస్తున్నారు. మోసగాళ్లు కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇందుకు తాజా ఉదంతం ప్రత్యక్ష సాక్ష్యం! డీలర్‌షిప్ పేరుతో ఓ నెరగాడు ఒక వ్యక్తిని రూ. 12.50 లక్షల మేర మోసం చేశాడు.…