దేశానికి వెన్నెముక అయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. నీటి సౌకర్యాలను కల్పిస్తూ.. ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రైతులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రకటించారు. సీఎం హౌస్‌లోని సమత్వ భవన్‌లో కిసాన్ ఆభార్ సమ్మేళన్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసి వెంటనే…