గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు తమ అద్భుత మేధస్సుతో అసాధ్యమైనదాన్ని సుసాధ్యం చేశారు. తుక్కు సామాన్లు (Scrap Metal) , రీసైకిల్ చేసిన భాగాలను ఉపయోగించి ‘గరుడ’ (Garuda) పేరుతో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఎలక్ట్రిక్ సూపర్‌బైక్‌ను తయారు చేశారు. దేశంలోనే తొలి AI ఇంటిగ్రేటెడ్ సూపర్‌బైక్‌గా పిలవబడుతున్న ఈ వాహనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేధావుల బృందం: భగవాన్ మహావీర్ యూనివర్సిటీకి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు…