గుడ్లను క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెడుతున్న ఇటీవలి వాదనలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొట్టిపారేసింది. అటువంటి ప్రచారాలు తప్పుదారి పట్టించేవి, శాస్త్రీయంగా నిరాధారమైనవి, అనవసరంగా ఆందోళన కలిగించేవి అని పేర్కొంది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ దేశంలో లభించే గుడ్లు తినడానికి సురక్షితమైనవని, గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని ఆరోపించే నివేదికలకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది. భారత్ లో విక్రయించే…