వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ఎంజాయ్ చేసిన చిన్నారులు నేడు అంగన్వాడీ కేంద్రాల బాట పట్టారు. మొదటి రోజు కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు కలిసి చిన్నారులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (డాక్టర్ ధనసరి అనసూయ) ఆదేశాల మేరకు మొదటి రోజు లంచ్‌లో ఎగ్ బిర్యానీని అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు వడ్డించింది. ఎగ్ బిర్యానీని…