రోజురోజుకు కొత్తకొత్త టెక్నాలజీలతో, కొత్తకొత్త ఆలోచనలతో జపాన్ లాంటి దేశాలు ముందున్నాయి. అందుకు కారణం అక్కడి విద్యా విధానం. అయితే టెక్నాలజీలో ముందున్న దేశాల పక్కన మన భారతదేశాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇందుకు విద్యా విధానంలో మార్పుల తప్పనిసరి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు అడుగులు వేయాలి. ఈ విధంగా ముందుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం…