స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సహచరురాలు సినీనటి అర్పితా ముఖర్జీకి సంబంధించి కోల్‌కతాలోని ఓఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. గత శుక్రవారం ఈడీ సోదాల్లో ఆమె ఇంట్లో సుమారు రూ. 21 కోట్ల నగదు, ఆభరణాలు బయట పడగా తాగాజా.. మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. బెల్ఘరియా టౌన్ క్లబ్‌లోని ముఖర్జీ నివాసం నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం…