కొత్త ఏడాది వేళ జపాన్‌ను వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోకముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Japan Earthquake : జపాన్‌లో సోమవారం 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు కనీసం ఆరుగురు మరణించారు. సోమవారం నాటి భూకంపానికి కేంద్రంగా ఉన్న జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో ఉన్న ఇషికావా ప్రిఫెక్చర్‌లో అన్ని మరణాలు సంభవించాయి.