సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో గురువారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రాణనష్టం లేదా గణనీయమైన నష్టం జరిగినట్లు నివేదికలు లేనప్పటికీ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది.
Earthquake Hits Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉత్తర ఫిలిప్పీన్స్ ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజధాని మనీలాకు 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం ధాటికి రాజధానిలోని ఎత్తైన భవనాలు కుదుపులకు లోనైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బుధవారం ఉదయం 8.43 గంటలకు అబ్రా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది.