కార్మికులు కష్టానికి కేంద్ర ప్రభుత్వం కరిగింది. పలు రంగాలకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిన కేంద్ర తాజాగా ఈ-శ్రమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ అయిన e-SHRAM పోర్టల్‌ను ప్రారంభించింది.
G. V. L. Narasimha Rao: అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈ- శ్రమ్ రిజిస్ట్రేషన్ లేబర్ కార్డులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన కానుక అని ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అన్నారు. ఈ- శ్రమ్ రిజస్ట్రేషన్ పథకంపై ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ సహాయమంత్రి రామేశ్వర్ సమాధానం ఇచ్చారు. ఈ - శ్రమ్ కార్డుదారులు భవిష్యత్తులో సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా పొందుతారని…