వినూత్న ప్రయోగాలతో ప్రయాణికులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC). బస్సుల్లో ఇకపై నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) స్థానంలో వీటిని తీసుకురావాలని నిర్ణయించింది ఆర్టీసీ. అందులో భాగంగా విజయవాడ, గుంటూరు-2 డిపోలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని ఆ దిశగా ప్రయోగం మొదలెట్టింది. డిజిటల్ కరెన్సీని విపరీతంగా వాడుతున్న…